అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్

అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్

ఉస్మానియాకు కొత్త భవనం కడతామంటే అడ్డు కున్నది ప్రతిపక్షాలే
సీఎం ముందుచూపుతో నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించారు
ఇప్పుడేమోవాళ్లే ఎగిరెగిరి పడుతున్నరు.. వాళ్లకు అల్జీమర్స్ఉందేమో?
కాళేశ్వరం నీళ్లు కషాయం నీళ్లా.. అంతచులకన అయిపోయిందా?
మంత్రి శ్రీనివాస్ గౌడ్ విసుర్లు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ముందుచూపుతో 2015లో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ కడతామంటే ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారని ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అప్పుడు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్, భట్టివంటి ప్రతిపక్ష నేతలు కొత్త భవనాన్నివ్యతిరేకించారని, ఇప్పుడేమో ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. కొత్త బిల్డింగ్ కు అడ్డుపడబోమని వాళ్లు ఇప్పుడు చెబితే ఏడాదిలో కొత్త బిల్డింగ్ కట్టి చూపిస్తామన్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని విమర్శించారు. పిచ్చిపట్టినట్టు ఆ పార్టీల నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కడితే తలలు నరుక్కుంటామంటూ అప్పుడు అడ్డుపడ్డారని, వాళ్లకు అల్జీమర్స్ జబ్బు వచ్చిందేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాల గగ్గోలుతోనే కరోనా పేషెంట్లు చనిపోతున్నరు
ప్రతిపక్షాలు సృష్టిస్తున్న భయాందోళనల వల్లే బతుకుతారనుకున్న కరోనా పేషెంట్లూ చనిపోతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కోర్టులకు పోయి ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చాకే రాష్ట్రంలో వైద్య రంగంలో మార్పులు వచ్చాయన్నారు. వైద్య రంగంలో తమ ప్రభుత్వం తెచ్చిన మార్పులేమిటో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ తీసుకున్న వారిని, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నవాళ్లనూ అడిగితే చెబుతారన్నారు. దయచేసి పేదల ఆరోగ్యంతో చెలగాటమాడొద్దని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఆయన కోరారు.

ఉస్మానియాపై కాంగ్రెసోళ్లు ఏనాడైనా ఆలోచించారా
70 ఏళ్ల పాలనలో ఉస్మానియా గురించి కాంగ్రెస్ నేతలు ఏనాడైనా ఆలోచించారా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘ఇన్నేళ్లు గడ్డి పీకిన ఉత్తమ్.. ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో ఆయన ఎప్పుడైనా ఉస్మానియాను సందర్శించారా? కాళేశ్వరం నీళ్లు కషాయపు నీళ్లంటూ కడుపు చించుకుంటున్నారు. కాళేశ్వరం నీళ్లంటే అంత చులకనా? ఉస్మానియా ఖాళీజాగాలో నాలుగు అంతస్థులకు మించి బిల్డింగ్
కట్టడానికి లేదని ఆ అజ్ఞానులకు తెలియదా? వేరే చోట బిల్డింగ్ కడితే మెడికల్ సీట్లు పోతాయన్న తెలివి లేదా? మెడికల్ కాలేజీ, టీచింగ్ ఆస్పత్రికి మధ్య దూరం 8 కిలోమీటర్లలోపే ఉండాలి. అందుకే వేరే చోట కట్టలేదు. ’’ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల పని కాళ్లలో కట్టెలు పెట్టడమేనని విమర్శించారు. ఢిల్లీలో కొట్లాడుకునే ఆ రెండు పార్టీలు.. ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

మెడికల్ కాలేజీలుఎందుకుతీసుకరాలేదు?
1978 నుంచి 2009 దాకా పాలించిన కాంగ్రెస్ నేతలు . . రాష్ట్రానికి ఒక కొత్త మెడికల్ కాలేజీనీ ఎందుకు తీసుకురాలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదు కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చామని, ఉద్యమంలో కేసీఆర్ మొత్తుకుంటేనే అప్పుడు రెండు మెడికల్ కాలేజీలు వచ్చాయని అన్నారు. కరోనా కంటే కాంగ్రెస్సే ప్రమాదకారి అన్నారు. మహబూబ్ నగర్ కు ఆధునాతన మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పేదలకు మేలు చేశామన్నారు.

For More News..

ప్రజలకు కనిపించని సీఎం ఎందుకు?

‘సంగమేశ్వరం’పై ఏపీ కొత్త స్కెచ్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

సర్కార్ తప్పులు.. ఆఫీసర్లకు శిక్షలు