
- రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం ఎస్సీ కాలనీలో సీఆర్ఆర్ నిధులు రూ.40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం లోగా సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. ఆయిల్ పామ్ లాంటి లాభసాటి పంటలు సాగు చేయాలని తెలిపారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. రఘునాథపాలెం మండలంలో వైద్య కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.