కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తప్పుడు ప్రచారం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తప్పుడు ప్రచారం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇస్తే తప్పేంటని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ ఎస్ అబద్ధాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత , చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో  ప్రాణహిత డిజైన్ మార్చి రూ. 80వేల కోట్లకు అంచనాలు పెంచారన్నారు. వాళ్లు డిజైన్ మార్చింది రైతులకు మేలు జరుగుతదని కాదు.. కమిషన్ కోసమని విమర్శించారు. తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని అబద్ధాలు సృస్టించారని అన్నారు. 

కాళేశ్వరంప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే జ్యుడిషియల్ కమిటీ వేశారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జ్యుడిషియల్ కమిటీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాళేశ్వరం డిజైన్ లో ఘోరమైన తప్పులున్నాయన్నారు.  DPR వ్యతిరేకంగా కాళేశ్వరం నిర్మాణం చేశారు.. BRS అధికారంలో ఉన్నప్పుడే కట్టడం, కూలడం రెండూ జరిగాయన్నారు.

 కాళేశ్వరానికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తప్పులు చేయకపోతే BRS నేతలు ఎందుకు భయపడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.