ధాన్యం కొనుగోలు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదు: మంత్రి ఉత్తమ్

 ధాన్యం కొనుగోలు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ ఎస్ నేతల ఆరోపణలు అర్థ రహతమన్నారు సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత్సరం మాత్రమే పాదర్శకంగా జరుగుతుందని  అన్నారు.  ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతితో మార్చి 25, 2024న ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్యాంకుల ద్వారా డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో వెళ్లే ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఎమ్మెస్పీ కంటే తక్కువ కేటు అమ్మాల్సిన అవసరం లేదని.. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్సే జీవన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరికి కనీస ధర 1,702  రెండు సార్లు టెండర్లు వేసింది..కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,220 యావరేజ్ ఎమ్మె్స్పీ ధరను ఇచ్చామన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం..అందులో ఇప్పటికే 6వేల కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నారు. MSP కంటే ఎక్కువ రేటు కు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు  సమయానికి పేమెంట్స్ చేస్తున్నామన్నారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. 

గత ప్రభుత్వం వంద హామీలు ఇచ్చి ప్రజలను మోసం నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. మా ప్రభుత్వం వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మాదే అన్నారు. దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన  ప్రభుత్వం మాదే అన్నారు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.