తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌‌‌‌లో  ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి హుజూర్ నగర్, నేరేడుచెర్ల, కోదాడ మున్సిపాలిటీలపై మున్సిపల్, ట్రాన్స్‌‌‌‌కో, పబ్లిక్ హెల్త్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నీరు సమృద్ధిగా ఉన్న బావులను లీజుకు తీసుకొని నీటి సమస్య ఉన్న ఏరియాలకు ట్యాంకర్ల  ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. హుజూర్ నగర్  మోడల్ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డును మరో చోటుకు మార్చాలని, త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.   అక్రమణలకు గురైన మున్సిపల్ లే అవుట్ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు.

అ స్థలాలపై కోర్టులో ఉన్న  కేసులు ఓడిపోతే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.  క్రిస్టియన్ శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించేందుకు  ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.  టౌన్ హాల్ రెనోవేషన్‌‌‌‌కు  కేటాయించిన రూ. కోటితో వెంటనే పనులు చేపట్టాలన్నారు.

 మధ్యలో ఆగిపోయిన గ్రంథాలయ పనులను  పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కోదాడ మున్సిపాలిటీలో అర్బన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవలప్ మెంట్ ఫండ్స్  నుంచి  రూ .230 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.  కాగా, కోదాడలో ప్రధాన రోడ్లను వెడల్పు చేయాలని

సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు  నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్లు  మంత్రిని కోరారు.  కోదాడ, నేరేడు చర్ల మున్సిపాలిటీ భవనాలు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని, వార్డుల్లో అదనంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు.