
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మమ్మల్నీ బద్నాం చేస్తున్నాయని ఫైరయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.సివిల్ సప్లయ్ శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మే 27వ తేదీ ఆదివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్టాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు ఉత్తమ్. గత 10 ఏళ్లలో సివిల్ సప్లయ్ శాఖను బీఆర్ఎస్ ఆగం పట్టిచిందన్నారు. ధాన్యం కొన్న మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని ఆయన చెప్పారు. వంద శాతం అవాస్తవాలే.. పైసా అవినీతి జరగలేదని తెలిపారు.
ప్రతిపక్షాలు ఇలాంటి దుర్మార్గపు నీచమైన ఆరోపణలు మానుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు మంత్రి.
ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా పారదర్శంగా ఉన్నామని ఉత్తమ్ చెప్పారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.59వేల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. మేం వచ్చే నాటికి సివిల్ సప్లయ్ శాఖను రూ.11వేల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. రూ.20వేల కోట్ల ధాన్యం గాలికి వదిలేసి పోయారని ఆయన మండిపడ్డారు. ఒక్క గింజ సన్నబియ్యం కొనకుండా స్కాం ఎట్లా చేశామని నిలదీశారు. డిఫాల్టర్ అయిన మిల్లులకు ప్రభుత్వం ధాన్యం ఇవ్వటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో నడిచినట్లే ఇప్పుడు నడవాలంటే కుదరదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చుట్టూ డిఫాల్టర్ మిల్లర్లు చేరి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పాడి లిఫ్ట్ అయిందే రూ.200 కోట్లు.. మరి, రూ. 2వేల కోట్ల స్కాం ఎట్లా జరిగిందని ఆయన ప్రశ్నించారు. కొత్తగా బీజేపీలో చేరి ఫ్లోర్ లీడర్ కొనుక్కోవచ్చు..కానీ మాకు అవసరం లేదని మంత్రి ఉత్తమ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చురకలు అంటించారు.