ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు  రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోంది :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గరిడేపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రైతు సహకార సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే అధికంగా ధాన్యం పడుతుందని ఆయన తెలిపారు. 

స్వాతంత్య్రం  వచ్చిన తర్వాత దేశంలో ఒకే పంటలో ఇంత ధాన్యం కొనుగోలు చేయడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, మద్దతు ధరతో పాటు బోనస్ ని 48 నుంచి 72 గంటల్లో ఒకేసారి రైతుల అకౌంట్లో వేస్తున్నామన్నారు. వరి పంటలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

పలు రోడ్ల నిర్మాణాలకు  శంకుస్థాపన 

గరిడేపల్లి మండలంలో పలు రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. గడ్డిపల్లి  గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల వరకు రూ. 8.28 కోట్లతో బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం,  పొనుగోడు గ్రామంలో పాత బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్ వరకు రూ. 50 లక్షల తో నిర్మించే  700 మీటర్ల రోడ్డుకు, పొనుగోడు గ్రామం నుంచి అప్పన్నపేట వరకు రూ. 3.15 కోట్లతో 4.5 కిమీల బీటీ రోడ్డు నిర్మాణానికి, మల్లయ్యగూడెం గ్రామంలో మల్లయ్య గూడెం నుంచి పాత నేరేడుచర్ల వరకు రూ. 70 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

 అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలో గరిడేపల్లి నుంచి అలింగాపురం వరకు 15.5 కి. మీ దూరాన్ని 30  కోట్ల రూపాయలతో నిర్మించిన డబులు బీటీ రోడ్ ను ప్రారంభించారు.  పొనుగోడు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసి చెరువులో వదిలారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ ఈఈ సీతారామయ్య, పీఆర్‌‌‌‌‌‌‌‌ ఈఈ వెంకటయ్య, డీఈ రమేశ్, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, తహసీల్దార్ కవిత, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.