లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • 1,39,037 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాలు పూర్తయితే కొత్తగా 1.39 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సచివాలయంలో రెండు  సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లలో  నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..  హుజూర్ నగర్ పరిధిలో ఎత్తిపోతలు పూర్తయితే  82,341 కొత్త ఆయకట్టు, కోదాడ నియోజకవర్గం పరిధిలో 56,696 వేల ఆయకట్టుకు మొత్తం1,39,037 ఎకరాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు.

  హుజూర్ నగర్ పరిధిలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌‌‌‌‌‌‌‌ ద్వారా 5,144 టీఎంసీల నీటితో 53,000 వేల ఎకరాలకు, జవహర్ జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 10,000 , బెట్టేతండా ఎత్తిపోతల పథకం ద్వారా 2041 , నక్కగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 3,200, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పధకం ద్వారా 14,100  సాగు నీరు అందుతుందని తెలిపారు.  

కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట ఎత్తిపోతల ద్వారా 4,460, రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల ద్వారా 5000, ఆర్- 9 ఎత్తిపోతల ద్వారా1500, మోతె ఎత్తిపోతల పథకం ద్వారా 45,736 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. లిఫ్ట్ నిర్మాణాలను ఇన్ టైంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈఎన్సీ అంజద్ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్ సూర్యాపేట జిల్లా సీఈ రమేశ్ బాబు, ఎస్‌‌‌‌‌‌‌‌ఈలు నాగభూషన్ నావు, శివధర్మ తేజ, ఈఈ సత్యనారాయణ  పాల్గొన్నారు.