
- మంత్రి వాకిటి శ్రీహరి
చిన్న చింతకుంట, వెలుగు: ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని ఉద్యాల గ్రామం నుంచి ఉంద్యాల తండా వరకు రూ.2.70 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనలకు భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తి ఆలయ గాలిగోపురం ఎదుటరూ.75 లక్షలతో చేపట్టిన పనులకు భూమిపూజ చేసి, రూ.34 లక్షలతో కురుమూర్తి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 200 కిలో లీటర్ల వాటర్ పంప్‌ను ప్రారంభించారు.
కౌకుంట్లలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, గ్రామపంచాయతీ బిల్డింగ్, హైస్కూల్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెడుతుందని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, దేవరకద్ర ఏఎంసీ చైర్మన్ కథలప్ప, నాయకులు అరవింద్‌రెడ్డి, వట్టెం శివకుమార్, ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఈవో మల్లేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లయ్య, ఎంఈవో మురళీకృష్ణ పాల్గొన్నారు.