టీచర్ల పెండింగ్ సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

 టీచర్ల పెండింగ్ సమస్యలు పరిష్కారిస్తాం :  మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: టీచర్ల పెండింగ్​ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రాం, బీసీ కాలనీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్​లో ఉన్న టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి వరకు చదువుకునేందుకు 2 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఈ సమస్యను గుర్తించి కొత్త ప్రైమరీ స్కూళ్లను మంజూరు చేయించినట్లు చెప్పారు.

 రాష్ట్రంలో 25వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు చేసినట్లు తెలిపారు. రూ.200 కోట్లతో మక్తల్​ సమీపంలో ఇంటిగ్రేటెడ్  స్కూల్  నిర్మాణానికి భూసేకరణ జరిగిందని, త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి స్కూల్​లో నాణ్యమైన భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నామన్నారు. ట్రైనీ కలెక్టర్  ప్రణయ్ కుమార్, డీఈవో గోవిందరాజులు, ఎంఈవో అనిల్ గౌడ్, తహసీల్దార్​ సతీశ్​కుమార్, మున్సిపల్  కమిషనర్  శంకర్ నాయక్  పాల్గొన్నారు.

జోగులాంబ అమ్మవారికి పూజలు..

అలంపూర్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరింత శక్తి, సామర్థ్యం ఇవ్వాలని జోగులాంబ అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం మంత్రి కుటుంబ సమేతంగా జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గణపతి పూజ అనంతరం బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం, అర్చన నిర్వహించారు.

 అనంతరం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం బహూకరించి ఆశీశ్వరదించారు. అనంతరం ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తో కలిసి కొత్తగా ప్రారంభించిన బాల బ్రహ్మేశ్వరస్వామి నిత్యాన్నదాన సత్రం, ప్రసాద్  స్కీం భవనంలో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. జడ్పీ మాజీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్  మంజుల, ఈవో పురేందర్  పాల్గొన్నారు.