నిరుద్యోగ యువత కోసం యాప్ ప్రారంభించిన మంత్రి

నిరుద్యోగ యువత కోసం యాప్ ప్రారంభించిన మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్ లైన్ వీడియో యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు షార్ట్ కట్లు లేవని.. చదవడం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉండాలని మంత్రి సూచించారు. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, పైరవీలు ఉండవని స్పష్టం ఆయన చేశారు. 

ప్రెసిడెన్సీయల్ ఆర్డర్ లో మార్పులు చేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇచ్చే విధానం తెచ్చుకున్నాము. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు మంత్రి వేముల. ఏకకాలంలో 90 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం చరిత్ర అని అన్నారు. మీకు ఏం కావాలో అన్ని మేము ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడమే అని అభ్యర్ధులకు మంత్రి నిర్ధేశించారు. ఉచితంగా ఆన్ లైన్ క్లాసుల యాప్ సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్న నేతల రాష్ట్రంలోనే ఇప్పుడు కరెంట్ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.