చెన్నూరులో గణనాథుడికి మంత్రి వివేక్ పూజలు

చెన్నూరులో గణనాథుడికి మంత్రి వివేక్ పూజలు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి మంగళవారం (సెప్టెంబర్ 03) చెన్నూర్​నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు క్యాంపు ఆఫీస్​లో కొలువుదీరిన గణనాథుడికి పూజలు చేశారు. జైపూర్​ మండలం ఇందారంలో గణేశ్ ఉత్సావాల్లో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించారు.

 రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. రామకృష్ణాపూర్​లో కలెక్టర్​తో కలిసి ఫిషరీస్​ వాహనాన్ని ప్రారంభించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ​రాజశేఖర్​ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

కోటపల్లి మండలం బబ్బరిచెలకలో కాంగ్రెస్ యువ లీడర్ నందకిశోర్​ నాన్నమ్మ అసంపల్లి శంకరమ్మ ఇటీవల చనిపోగా ఆమె కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు.