కొడంగల్ లో ఏటీసీ సెంటర్ కు ..శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

కొడంగల్ లో ఏటీసీ సెంటర్ కు ..శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

వికారాబాద్ జిల్లాలో   పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో నూతనంగా నిర్మించనున్న ATC సెంటర్ కు  భూమి పూజ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి,  కొడంగల్  ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి,  కాడా( కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..కొడంగల్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఐటీఐలను ఆధునీకరించి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏటీసీ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. పదవ తరగతి పాసైన యువతి యువకులకు ఏటీసీ సెంటర్లలో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి తపన ఉంది. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యావంతులకు ప్రయోజనం జరుగుతోంది. ఏటీసీల ద్వారా గ్రామీణ నిరుపేద యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రయోజనం జరుగుతుంది. 

టాటా గ్రూపుతో ఒప్పందం ద్వారా సిఎస్ఆర్ నిధులతో 4 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. త్వరితగతిన ఏటీసీ భవనం నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెస్తాం. సుమారు 8 కోట్ల వ్యయంతో హకీంపేట లో ఏటీసీ భవనం ఏర్పాటు కానుంది. మౌలిక సదుపాయాలు మిషనరీ కలిపి సుమారు 50 కోట్ల ప్రాజెక్టు ద్వారా కొడంగల్ యువతకు ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందనున్నారు. చక్కటి అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి అని వివేక్ వెంకటస్వామి అన్నారు.


 

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్, ఎంటెక్ తరహలో సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నది. వాటి ద్వారా రోబోటిక్స్ లాంటి అత్యాధునిక మెషినరీతో ట్రైనింగ్ ఇవ్వనుంది.  టాటా టెక్నాలజీస్ కంపెనీ సహకారంతో రాష్ట్రంలో మూడు విడతల్లో 111 ఏటీసీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. మొదటి విడతలో 25 సెంటర్లు ఓపెన్ చేయగా.. రెండో విడతలో ఈ ఏడాది 45 సెంటర్లు ప్రారంభిస్తున్నది. ఇవికాక మరో 46 ఏటీసీలను మూడోవిడతలో ఏర్పాటు చేయనుంది.బిల్డింగ్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, రోబోటిక్ పరికరాల కోసం ఒక్కోదానికి రూ.45 కోట్ల చొప్పున మొత్తం రూ.5 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది

ALSO READ : వరద సాయానికి రూ.200 కోట్లు రిలీజ్

57 ఏటీసీల్లో వంద శాతం ఫుల్‌‌

రాష్ట్రంలో మొత్తం 64 ఏటీసీలు ఉండగా.. 57 ఏటీసీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగతా 7 ఏటీసీల్లో సైతం 65 శాతానికి పైగా ఫిల్‌‌ అయ్యాయి. ఒక్కో ఏటీసీలో 172 సీట్ల చొప్పున మొత్తం 11,008 సీట్లు ఉండగా.. శనివారం వరకు 10,800 అడ్మిషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా  98 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఆఫీసర్లు తెలిపారు