- జువ్వాడి నర్సింగరావుతో చర్చలు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి ఆదివారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చారు. జువ్వాడి భవన్‌లో ఆయనకు కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు తేనీటి విందు ఇచ్చారు. కాసేపు లీడర్లతో ముచ్చటించారు. అనంతరం వివేక్ వెంకటస్వామిని.. జువ్వాడి, పార్టీ లీడర్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం కోరుట్ల మీదుగా మంచిర్యాలకు బయలుదేరి వెళ్లారు.
