చెన్నూర్ మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి, ఎంపీ

చెన్నూర్ మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి, ఎంపీ
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

చెన్నూర్, వెలుగు : మండలంలోని వెంకంపేట గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్ చెడిపోయి తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. వారు వెంటనే స్పందించి కొత్త మోటార్ మంజూరు చేశారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిత హిమవంతరెడ్డి, గ్రామస్తులతో కలిసి కొత్త మోటర్ బిగించి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హిమవంతరెడ్డి మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దుగ్నేపల్లి నుంచి వెంకంపేట వరకు రూ.1.17 కోట్లతో బీటీ రోడ్డు, ఉపాధిహామీ నిధుల ద్వారా రూ.20 లక్షలు, డీఎంఎఫ్​టీ నుంచి రూ.5 లక్షలతో సీసీ రోడ్లను ఇప్పటికే మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.