
- చెన్నూరు వార్డుల్లో మార్నింగ్ వాక్
- మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆదేశించారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్కృషి చేస్తోందన్నారు. శనివారం ఆయన చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రి, మంచిర్యాల పట్టణాల్లో పర్యటించారు. చెన్నూరు పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
రూ.30 కోట్లతో డ్రింకింగ్ వాటర్సప్లై కోసం చేపట్టిన అమృత్2.0 పనులు, బస్తీ దవాఖానాను పరిశీలించి వెంటనే పనులు పూర్తిచేయాలని ఆఫీసర్లు, కాంట్రాక్టర్‌కు సూచించారు. మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్అసోసియేషన్ బాధ్యులు రామారావు, సదాశివారెడ్డి, మదన్మోహన్, వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్లు మంత్రిని కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్య తీర్చుతానని మంత్రి హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతిచెందిన క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కుర్మపల్లి గ్రామానికి చెందిన బైర వీరమల్లమ్మ, రామకృష్ణాపూర్16వార్డుకు చెందిన కట్ల లక్ష్మి, మందమర్రి అంగడిబజార్‌కు చెందిన అంగన్వాడీ ఆయా కౌసర్ భాను, మార్కెట్లో పసునూరి రామకృష్ణ కుటుంబాలను పరామర్శించారు.
అనారోగ్యం, ప్రమాదాల బారినపడిన కాంగ్రెస్ కార్యకర్తలు మారపెల్లి రాజయ్య, యమహా శ్రీనివాస్, వెల్ది సాయి, మంచిర్యాలలోని హెల్త్కేర్హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆలం రమణను మంత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.