
- నదిలో మునిగి చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీశైలం కుటుంబానికి పరామర్శ
- అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రాణహిత నదీ తీరంలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త దాగామ శ్రీశైలం కుటుంబసభ్యులను బుధవారం (అక్టోబర్ 23) ఆయన పరామర్శించారు.
చెన్నూరు హాస్పిటల్‌లో శ్రీశైలం మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ... శ్రీశైలం చనిపోయిన చోట గతంలోనూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెన్నూరు రూరల్‌సీఐ బన్సీలాల్‌ను ఆదేశించారు. నదుల్లో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
‘‘శ్రీశైలం ఈ నెల 20న గ్రామ యువకులతో కలిసి ఆలుగామ దగ్గర ప్రాణహిత నదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఆ టైమ్‌లో నదిలో మునిగి చనిపోవడం బాధాకరం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తాం” అని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్గెలుపు కోసం శ్రీశైలం చాలా కష్టపడ్డాడని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. కాగా, కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్స్టూడెంట్నదీమొద్దీన్కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్మండలం పడ్తన్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ లీడర్ అంకం మారుతి తండ్రి రాజయ్య మరణించగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
రోడ్డు నిర్మాణానికి హామీ..
కోటపల్లి మండలం లక్ష్మిపురం గ్రామం నుంచి శ్మశానం వరకు రోడ్డు నిర్మిస్తానని, నేషనల్ హైవే దగ్గర బోర్ వేయిస్తానని మంత్రి వివేక్‌వెంకటస్వామి హామీ ఇచ్చారు. అన్నారం నుంచి తిరిగివస్తున్న మంత్రి.. లక్ష్మిపురం దగ్గర ఆగి గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డు, బోరు గురించి మంత్రి దృష్టికి తేగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కాగా, జైపూర్‌లోని సింగరేణి థర్మల్పవర్ప్లాంట్జీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన నరసింహారావు బుధవారం మంత్రి వివేక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి మొక్కను అందజేశారు.