బిజీ షెడ్యూల్ వల్లే వర్షవాస్ కు హాజరు కాలేదు : మంత్రి వివేక్ వెంకటస్వామి

బిజీ షెడ్యూల్ వల్లే వర్షవాస్ కు హాజరు కాలేదు : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మంత్రి వివేక్ వెంకటస్వామి వీడియో సందేశం 

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో మంగళవారం నిర్వహించిన 34వ వర్షవాస్ ముగింపు కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వీడియో సందేశం విడుదల చేశారు. ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా వీలుపడక వర్షవాస్ కార్యక్రమానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. 

ఈ ప్రాంతం బౌద్ద ధర్మం ఆచరణకు నెలవు అని తమ తండ్రి కాకా వెంకటస్వామి పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. తాను బుద్ధుడి బోధనలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. బుద్దుని ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి తప్పకుండా వాంకిడి జెత్వన్ బుద్ధ విహార్​కు వస్తానన్నారు. తనను ఆహ్వానించిన అంబేద్కర్, బౌద్ధ సంఘాల నాయకులకు అండగా ఉంటానన్నారు.