మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఎంపీ వంశీకృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఎంపీ వంశీకృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో  వందే భారత్ రైలు హాల్టింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ ట్రైన్ హాల్టింగ్ ను జెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి. 

 ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తాను ఎంపీగా ఉన్న టైంలోనే రైల్వేల అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు.  స్థానిక అవసరాలు ,డిమాండ్లకు అనుగుణంగా వందే భారత్ కోసం కృషి చేశానన్నారు.  గతంలో కేరళ ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ కోసం కృషి చేశానని తెలిపారు వివేక్.  మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా చాలా అవసరం ఉందన్నారు.  మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఎంపీ వంశీకృషి చేస్తున్నారని తెలిపారు.  రామగుండంలో యూరియా ఉత్పత్తి లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయన్నారు.  రామగుండంలో యూరియా ఉత్పత్తి జరిగితే రైతుల సమస్యలు తీరతాయన్నారు మంత్రి వివేక్. 

తగ్గనున్న ప్రయాణ సమయం 

మంచిర్యాలలో వందేభారత్‌‌‌‌కు హాల్టింగ్‌‌‌‌ ఇవ్వడంతో ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌‌‌‌కు కేవలం మూడు గంటల్లో చేరుకునే అవకాశం కలుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రలో 575 కిలోమీటర్లు ప్రయాణించే వందేభారత్‌‌‌‌ రైలుకు ఇప్పటికే కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్‌‌‌‌లో హాల్టింగ్‌‌‌‌లు ఉండగా.. త్వరలోనే మంచిర్యాల, కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌లో సైతం ఆగనుంది. నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు మొదలయ్యే వందేభారత్‌‌‌‌.. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌ చేరుకుటుంంది. సికింద్రాబాద్‌‌‌‌ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్టేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌‌‌‌పూర్‌‌‌‌ చేరుకుంటుంది.