సిద్దిపేట: మల్లన్నసాగర్ వద్ద 53 ఎకరాల్లో ఫిష్ పాండ్ ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ మేరకు మత్స్య శాఖ మంత్రితో మాట్లాడి సాంక్షన్ చేయిస్తానన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు.
భూంపల్లి అక్బర్ పేట మండలం చిట్టాపూర్ లోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఫిష్ ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు మత్స్య అభి వృద్ధి, స్టేట్ సెక్టార్ పథకం ద్వారా కృషి చేస్తుందన్నారు. వంద శాతం రాయితీపై చిట్టాపూర్ పెద్ద చెరువులో 2.20 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
