చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్..అభివృద్ధి పనులు పరిశీలన

చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్..అభివృద్ధి పనులు పరిశీలన

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు  కాంగ్రెస్ ప్రభుత్వం  కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సుప్రీం కోర్టు రిజర్వేషన్ లను ఆపాలని తీర్పు ఇచ్చిందని.. దానికి నిరసనగా ఇవాళ తెలంగాణ  వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రజలు, వ్యాపారవేత్తలు అందరూ సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో పోరాడుతున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మాణం చేశామన్నారు. 

చెన్నూర్ మున్సిపాలిటీలో అక్టోబర్ 18న  మార్నింగ్ వాక్ నిర్వహింరచారు  మంత్రి వివేక్ వెంకటస్వామి.  మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బస్తీ దవాఖాన, అమృత్ 2.0 వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు..  బీసీ బందులో అందరూ భాగస్వాములు కావాలని బంద్ పాటించాలని పిలుపునిచ్చారు వివేక్.