కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి మంత్రి వివేక్ పరామర్శ

కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి మంత్రి వివేక్ పరామర్శ

నిజామాబాద్, వెలుగు: రౌడీషీటర్ షేక్ రియాజ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​కుమార్ భార్య ప్రణీతతో మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం (అక్టోబర్ 23) ఫోన్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

నిజామాబాద్ సిటీలో ప్రమోద్ కుమార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రమోద్ కుమార్ కుటుంబంతో మంత్రి వివేక్​ మాట్లాడటంతో కొంత రిలీఫ్ లభించిందని నిజామాబాద్ జిల్లా మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, టీజీవో ప్రెసిడెంట్ ఆలుక కిషన్​ అన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు.