ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం : మంత్రి వివేక్

ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం : మంత్రి వివేక్
  • ఐటీఐ స్టూడెంట్లకు అవసరమైన స్కిల్స్ నేర్పిస్తం: మంత్రి వివేక్ 
  • విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి 
  • కంపెనీలకు అవసరమయ్యే స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాలి 
  • కోర్సులను క్వాలిటీగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం 
  • ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులకు అవార్డులు ప్రదానం  

హైదరాబాద్, వెలుగు:  ఐటీఐ విద్యార్థులకు అవసరమైన స్కిల్స్ నేర్పించి, ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విజన్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా వాళ్లను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. శనివారం డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీఐ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 

దీనికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీఐల్లో చదివి వివిధ ఉద్యోగాల్లో రాణిస్తున్న 51 మంది పూర్వ విద్యార్థులు, 43 మంది రిటైర్డ్ ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 8 మంది మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా  ఐటీఐ,  ఏటీసీ (అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్ సెంటర్) కొత్త లోగోను, స్కూళ్ల దగ్గర ఏర్పాటు చేయనున్న బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. స్కిల్స్ లేకపోతే కంపెనీలు జాబ్స్ ఇవ్వడం లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ గురించే చర్చ జరుగుతున్నదని చెప్పారు. కంపెనీలకు అవసరమమైన స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఐటీఐలు, ఏటీసీల్లో నేర్పిస్తున్న కోర్సులను క్వాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. 

విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించడానికి కంపెనీలతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలని సూచించారు. ‘‘ప్రతి పరిశ్రమ ఒక ఐటీఐని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి. వాళ్లకు కావాల్సిన విధంగా కోర్సులు రూపొందించాలి. ప్రిన్సిపాల్స్ పరిశ్రమలతో అనుసంధానం కావాలి. 100 శాతం ఉపాధి అందించడమే లక్ష్యంగా పని చేయాలి. ఇతర శాఖల కంటే కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఉత్తమ పనితీరు కనబర్చాలి” అని అన్నారు. నాడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి.. ఐటీఐలను స్థాపించి నిరుద్యోగులు ఉపాధి పొందేలా కృషి చేశారని గుర్తుచేశారు. 

ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేస్తం: దానకిశోర్ 

ఐటీఐలు అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కాదు.. ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అనే విధంగా అభివృద్ధి చేస్తామని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తెలిపారు. యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. ఐటీఐల్లో అడ్మిషన్లు, కోర్సుల వివరాలు తెలిపేలా అన్ని స్కూళ్ల దగ్గర బోర్డులు ఏర్పాటు చేస్తామని.. బ్రోచర్లు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ రీజినల్ డైరెక్టర్ కె.శ్రీనివాస రావు, ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీకే నగేశ్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో మయూర్ తదితరులు పాల్గొన్నారు. 

గంటన్నర రివ్యూ.. 

కార్మిక శాఖ అధికారులు, ఐటీఐ ప్రిన్సిపల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీఐలపై దాదాపు గంటన్నర పాటు చర్చించి.. ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిశానిర్దేశం చేశారు. 100 శాతం ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకోసం టీ గేట్ (తెలంగాణ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) పాలసీ విధివిధానాలను అమలు చేయాలని చెప్పారు. వచ్చే ఏడాదికి సంబంధించి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విజన్ డాక్యుమెంట్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. కాగా, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విజన్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2025ని మంత్రికి వివరించారు. 

చదువుకున్న స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరవద్దు మంత్రి వివేక్ వెంకటస్వామి

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా చదువుకున్న స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరిచిపోవద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పూర్వ విద్యార్థులు ఏదో ఒక రకంగా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. తాను చదవుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్)కు శనివారం మంత్రి హోదాలో వివేక్ వెళ్లారు. రామంతాపూర్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఇన్వెస్టిచర్ సెర్మనీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇన్వెస్టిచర్ వేడుకలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్లు తదితర స్థానాలకు ఎంపికైన విద్యార్థులకు మంత్రి బ్యాడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందించి అధికారికంగా బాధ్యతలు అందించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కష్టపడితే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించవచ్చని చెప్పారు. 

“17 ఏండ్ల తర్వాత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చాను. బేగంపేట హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. బేగంపేట, రామాంతాపూర్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చదువు, క్రీడలు, కల్చరల్ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నింటిలో సమానంగా ఉండేవి” అని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ 2025 మ్యాగజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ క్యార్యక్రమంలో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ పూర్వ విద్యార్ధి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.