కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ వెంకటస్వామి

కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ వెంకటస్వామి

మాలల జాతికోసం కొట్లాడుతున్నాం.. రోస్టర్ పై మాలల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. కొట్లాడితేనే హక్కులు వస్తాయి.. కలిసి ఉంటేనే కుల వివక్షను ఎదుర్కొగలమన్నారు. నేను ఎప్పుడు న్యాయం వైపు ఉంటాన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. ఇంఛార్జీ మంత్రిగా జూబ్లీహిల్స్​ లో గెలుపు కోసం కృషి చేస్తానన్నారాయన. కష్టపడిపనిచేస్తున్న నాపై కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 

నిజామాబాద్​ లో మాలల ఐక్యవేదిక సదస్సులో పాల్గొన్న మంత్రి వివేక వెంకటస్వామి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ తో ఎలాంటి విభేధాలు లేవు.. మాలలు, మాదిగల మధ్య కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. రాజకీయాల్లో అడ్లూరిని ప్రొత్సహించింది కాకా వెంకటస్వామినే.. ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం.. విమర్శలను పట్టించుకోను.. అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. 

నిజాయితీగా వ్యాపారం చేయమని మా నాన్న కాకా వెంటకస్వామి నాకు చెప్పారు. నాకు ఎలాంటి అహంకారం లేదు.. నిస్వార్థంగా సేవ చేస్తానన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి.