
రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డిలో పర్యటించిన మంత్రి.. తడిచిన ధాన్యం విషయంలో రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్ సిఐతో మాట్లాడి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 8 పత్తి కొనుగోలు ఏర్పాటు చేశామని.. అవసరమైతే కొనుగోలు కేంద్రాలు ఇంకా పెంచుతామన్నారు. సోయా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 104 రైతు వేదికలకు 104 వేదికలు పూర్తి చేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ ముసాయిదా బిల్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ లో తీర్మానం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు ద్వారా రైతుల వ్యవసాయ పొలాల వద్ద మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచే ఆలోచన చేస్తుందన్నారు.
మేడిపల్లిలో ఉద్రిక్తత..ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని అడ్డుకున్నగ్రామస్తులు
కుప్ప కూలిన సర్దార్ సర్వాయి పాపన్నకోట