పైల్వాన్లకు హైదరాబాద్ వేదిక: మంత్రి శ్రీనివాస్ గౌడ్

పైల్వాన్లకు హైదరాబాద్ వేదిక: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం రేజ్లింగ్ పోటీలను ప్రోత్సహిస్తుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన హింద్ కేసరి 2022, 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ రెజ్లింగ్ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు మంత్రులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. పైల్వాన్ లకు హైదరాబాద్ వేదిక అని అన్నారు. రేజ్లింగ్ పోటీలను ప్రోత్సహిస్తున్న హింద్ కేసరికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రెజ్లింగ్ పోటీలు సంవత్సరంలో రెండు సార్లు నిర్వహించేలా చూస్తామన్నారు. ఈ రెజ్లింగ్ పోటీల్లో గెలుపొందిన మెన్, ఉమెన్స్ విజేతలకు ప్రభుత్వం తరపున చెరో లక్ష రూపాయలు ప్రైజ్ మని ఇస్తామని తెలిపారు.

రెజ్లింగ్ ఛాంపియన్ పోటీలు ఉత్సహంగా జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లో చాలా మంది పైల్వాన్ లు ఉన్నారని వెల్లడించారు. ఈ రెజ్లింగ్ పోటీలతో వారిలో క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. యువతి యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడాలో రాణించాలని మంత్రి సూచించారు.