
పార్లమెంట్ కి భద్రత కల్పించడంలో NDA ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంట్భవనానికే రక్షణ కల్పించలేని వారు దేశానికి భద్రత ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా చట్టాలు చేయుచూ... ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కుతూ సభనుంచి సస్పెండ్ చేశారన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను తీసేస్తే .... హైకోర్టు ధర్నా చౌక్‌కు అనుమతి ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి నిరంకుశత్వ ప్రభుత్వాన్ని తొలగించారంటూ... నియంతృత్వ ధోరణి అవలంభించే బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా... తొలగించాలా ప్రజలు ఆలోచించాలన్నారు.
పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి.. బీజేపీ ప్రభుత్తం బిల్లులను పాస్ చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఆలోచించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలను కోరారు.