కరోనా అలర్ట్: స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం సూచనలు

కరోనా అలర్ట్: స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం సూచనలు

దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రకాలుగా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. వదంతులు ప్రచారాన్ని అడ్డుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు కొన్ని సూచనలు చేస్తూ అడ్వైజరీ జారీ చేసింది. విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని చెబుతూ రాష్ట్రాల సీఎస్‌లు, విద్యా శాఖ కార్యదర్శులు, సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు లేఖలు పంపింది కేంద్ర మానవ వనరుల శాఖ. విద్యార్థులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు జర్వం, జలుబు లాంటి ఉంటే వారికి వెంటనే సెలవు ఇవ్వాలని సూచించింది.

  • కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి.
  • తరచూ చేతులు కడుక్కోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చేటప్పుడు కర్చీఫ్ లేదా టీష్యూ అడ్డుపెట్టుకోవాలి. దీని ద్వారా కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా లాంటి పలు అంటువ్యాధులను నివారించవచ్చు.
  • విద్యార్థులు, యువతకు ఈ సమాచారం తెలియజేయడం ద్వారా మరింత మందికి అవగాహన కల్పించవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని కేంద్రం కోరింది.