నాకు న్యాయం కావాలి..

V6 Velugu Posted on Sep 17, 2021

గుహవటి: తండ్రి లేని పిల్లల బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే. అస్సాంలోని సిల్చార్‌కు చెందిన నాలుగేళ్ల రిజ్వాన్ సాహిద్ లస్కర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రిజ్వాన్ మూడు నెలల వయసులో ఉన్నప్పుడే (2016, డిసెంబర్ 26న) అతడి నాన్న (సహిదుల్) ను కొందరు దుండగులు చంపేశారు. అయితే ఇప్పటివరకు ఆ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హేమంత్ బిస్వాకు రిజ్వాన్ ఓ వీడియో పంపాడు. ఈ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘‘నా పేరు రిజ్వాన్ సాహిద్ లస్కర్. డియర్ సార్, నేను మూడు నెలల వయసులో ఉన్నప్పుడే 11 మంది దుండగులు మా నాన్నను కిరాతకంగా చంపారు. ఈ కేసులో నాకు న్యాయం జరగాలి’ అని రిజ్వాన్ విజ్ఞప్తి చేశాడు. 

 

Tagged pm modi, assam, Minor boy, Central Home Minister Amith Shah, Guhawati, CM Hemanta Biswa Sharma, Rizwan Sahid Laskar

Latest Videos

Subscribe Now

More News