ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ హోర్డింగ్ ఎక్కిన బాలిక

V6 Velugu Posted on Nov 10, 2020

ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ప్రేమించిన ప్రియుడితోనే తన పెళ్లి జరిపించాలంటూ ఓ మైనర్ బాలిక హోర్డింగ్ ఎక్కింది. తన పెళ్లికి ఒప్పుకోవాలని తల్లిదండ్రులను డిమాండ్ చేస్తూ తన ప్రియుడికి.. తల్లిదండ్రులకు హోర్డింగ్ పై నుండే మెసేజ్ పంపింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు హోర్డింగ్ దగ్గరకు చేరుకున్నారు. బాలికను కిందకు దింపేందుకు పలుమార్లు పోలీసులు గట్టిగా కేకలు బేసి బతిమాలారు. ఇది చూసిన జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ బాలిక హోర్డింగ్ ఎక్కడం.. అది చూస్తూ.. అక్కడ జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. ఈ  ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పెళ్లికి ఒప్పుకునే వరకు దిగేది లేదంటూ బాలిక భీష్మించుకుని కూర్చుంది. చాలా ఎత్తులో ఉన్న హోర్డింగ్ పైనే కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోయింది. బాలికను కిందకు దింపేందుకు పోలీసులు బతిమాలినా ససేమిరా అనడంతో వెంటనే ప్రియుడిని పిలిపించారు. అతని ద్వారా బాలికను ఒప్పించడంతో.. వెంటనే దిగివచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పరదేశిపుర పోలీసు స్టేషన్ ఇంచార్జ్ అశోక్ పతిదార్ తెలిపారు.

Tagged SI, Girl, confirmed, lover, to, incident, climbs, Indore, Minor, marry, ahshok patidar, atop, hoarding, indore city, paradeshipura police station limits, pardesipura

Latest Videos

Subscribe Now

More News