మందు కోసం సతాయిస్తున్రు

మందు కోసం సతాయిస్తున్రు

వింతగా ప్రవర్తిస్తున్న మైనర్లు
బస్తీలు, స్లమ్స్ లో ఉండే వారే ఎక్కువ
రెస్క్యూ చేసి 323 మందిని గుర్తించిన సంకల్ప్ ఫౌండేషన్
షెల్టర్ హోమ్స్ లో కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో వైన్స్ బంద్ కావడంతో ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అయిన కొందరు మందుబాబులు వింతగా ప్రవర్తించడం, చనిపోతామంటూ బెదిరించడం, ఇంట్లోనుంచి పారిపోవడం లాంటివి చేస్తున్నారు. మానసికస్థితి కొల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ హాస్పిటల్ లో చేరుతున్నారు. గత నెల 30న ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఒక్కరోజే ఇలాంటి కేసులు 100 వచ్చాయి. లాక్ డౌన్ తో మరిన్నికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్లోని కొన్ని బస్తీల్లో ఉండే మైనర్లు, వలస కూలీల పిల్లలు, స్లమ్స్ లో ఉండే బెగ్గర్స్ సైతం ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. స్లమ్స్ లో ఉండే మైనర్లు మద్యం కోసం రాళ్లతో కొట్టుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. బస్తీలు, సమ్స్ లో ఉండే కొందరు పిల్లలు వారి పెద్దల నుంచి డ్రింకింగ్ అలవాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. క్రమక్రమంగా వారు ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతున్నారు. లాక్ డౌన్ తో మద్యం దొరక్క మందుబాబులు ఎలా సతాయిస్తున్నారో.. కొందరు మైనర్లు సైతం అలాగే బిహేవ్ చేస్తున్నారు. మందు కావాలంటూ నానా హంగామా చేస్తున్నారు. అంతగా వీరు మద్యానికి బానిసలవడంతో వీరిని రెస్క్యూ చేసేందుకు సంకల్ప్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.

మురికివాడల్లో రెస్య్కూ..
చందానగర్, శేరిలింగంపల్లిలో సంకల్ప్ ఫౌండేషన్ షెల్టర్ క్యాంప్స్ ఉన్నాయి. ఇవి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రన్ అవుతుంటాయి. ఈ ఫౌండేషన్ అనాథలు, బెగ్గర్స్, నిరాశ్రయులు, బాల కార్మికులను రెస్క్యూచేసి వారికి షెల్టర్ కల్పిస్తోంది. గత నెల 27 నుంచి వీరు స్లమ్స్ లో రెస్క్యూ చేస్తున్నారు. గ్రేటర్ లోని శామీర్ పేట, మియాపూర్, బాలానగర్, హఫీజ్ పేట, దుండిగల్, ఎన్టీఆర్ నగర్, ప్రేమ్ నగర్ లాంటి 10 సమ్ ఏరియాల్లో రెస్క్యూ చేసి మద్యానికి బానిసై వింతగా ప్రవర్తిస్తున్న మైనర్లను, పెద్దలను షెల్టర్ హోమ్ కి తరలించారు.

ఎంటర్ టైన్ మెంట్ తో మైండ్ సెట్ మార్చేలా..
వీరు రెస్క్యూ చేసిన 323 మంది మైనర్లలో అమ్మాయిలు సైతం ఉన్నారు. స్లమ్ కి ఇద్దరు చొప్పున.. 20 మంది ఫౌండేషన్ మెంబర్స్ టీమ్ గా ఏర్పడి రోజు ఆ ఏరియాల్లో తిరుగుతున్నారు. రెస్క్యూ చేసిన మైనర్లను షెల్టర్స్ లో పెట్టి వారి ఆలోచనను మార్చేలా ఎంటర్ టైన్ మెంట్ వీడియోస్ చూపించడం, గేమ్స్ ఆడించడం లాంటివి చేస్తున్నారు. మద్యానికి బానిసైన మైనర్ల తల్లిదండ్రులను ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు.

3 నెలలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం
స్లమ్స్ లో ఉండే పిల్లలు వారి పేరెంట్స్ వల్ల మద్యానికి అడిక్ట్ అవుతున్నారు. లాక్ డౌన్ తో మద్యం దొరక్క ఆగం జేస్తున్నారు. రెస్క్యూ చేసిన మైనర్లలో కొంతమంది మాత్రమే షెల్టర్ లో ఉన్నారు. మా 3 షెల్టర్స్ లో ఓ దాంట్లో 60, ఇంకో ప్లేస్ లో 50, మరో చోట 20మందిని ఉంచాం. మిగిలిన పిల్లలు ఇండ్లలోనే ఉన్నారు. వారిని డైలీ మా టీమ్ మెంబర్స్ వెళ్లి చూస్తుంటారు. రెస్క్యూ చేసిన మైనర్లను 3
నెలలు అబ్జర్వేషన్ లోనే ఉంచి చూసుకుంటాం.
– డా. రోజి గుండ్ర, సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకురాలు

For More News..

కరోనా టెస్టుల్లో ఏపీ రికార్డ్

కరోనా పోయిన తర్వాత పబ్లిక్ షాపింగ్ ఎలా ఉంటుందంటే..

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు