రేపు (నవంబర్ 11) కూడా డ్యూటీకి వచ్చినట్టు సంతకం.. హరీష్ రావు తనిఖీల్లో బయటపడ్డ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బాగోతం

రేపు (నవంబర్ 11) కూడా డ్యూటీకి వచ్చినట్టు సంతకం.. హరీష్ రావు తనిఖీల్లో బయటపడ్డ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బాగోతం

సిద్ధిపేట: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మిక తనిఖీల్లో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యుల బాగోతం బయటపడింది. అబ్బయ్య అనే డాక్టర్ రేపు (నవంబర్ 11) కూడా డ్యూటీకి వచ్చినట్టు సంతకం పెట్టడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అబ్బయ్య తీరుపై విచారణ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు.

హరీష్ రావు తనిఖీ సమయంలో సంతకం ఉన్నా ఎమర్జెన్సీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఎమర్జెన్సీ డాక్టర్లు అందుబాటులో లేకుంటే వచ్చే రోగులకు వైద్యం ఎలా చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి అందుబాటులో లేని వైద్యులతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఎందుకు లేరని డాక్టర్లపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.