
ఢిల్లీలో కాల్పులు కలకం సృష్టించాయి. ఇంద్రపురి ప్రాంతంలో ఉన్న జిమ్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిమ్ యజమాని సోదరుడికి గాయాలయ్యాయి. మృతి చెందిన చిన్నారి జిమ్ యజమాని ఫ్లాట్ లోనే తన ఫ్యామిలీతో కలిసి రెంటుకు ఉంటున్నాడు. దుండగులు కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.