
‘హీరో’ చిత్రంతో పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించగా, సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్ గల్లాకు జంటగా మిస్ ఇండియా 2020 విన్నర్ మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోందని గురువారం ప్రకటించారు. అలాగే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు తన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
ఇందులో సత్యభామగా మానస కనిపించనుందని రివీల్ చేశారు. ట్రెడిషినల్ గెటప్‌లో హాఫ్ శారీలో అందంగా కనిపిస్తున్న మానస.. ప్లజెంట్ స్మైల్‌తో ఆకట్టుకుంది. ఇందులో అశోక్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు.