‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి మరో సాంగ్ రిలీజ్

 ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి మరో సాంగ్ రిలీజ్

న‌‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి లీడ్‌‌ రోల్స్‌‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పి.మహేష్‌‌ బాబు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

సోమవారం ‘లేడీ లక్’ అంటూ మరో సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘ఎందుకంత ఇష్టం నేనంటే.. ఎందులోన గొప్ప నేను నీకంటే.. ఎంత ఎంత నచ్చుతుందో.. నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే.. అది ఎందుకంటే అందుకే.. అదంతే. నా లేడీ లక్ నువ్వే’ అంటూ సాగే పాటలో అనుష్క, నవీన్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

రథన్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. కార్తీక్ పాడిన తీరు బాగుంది. ఇందులో చెఫ్‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్‌‌ కమెడియన్‌గా సిద్ధు కనిపించనున్నాడు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల  కానుంది.