
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పి.మహేష్ బాబు దర్శకుడు. ఆగస్టు 4న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించారు.
అతి త్వరలోనే అన్ లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని అనౌన్స్ చేశారు. ఇప్పటికే మూడు పాటలు, టీజర్‌ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించను న్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.