మిస్ యూనివర్స్ పోటీకి రూల్స్ మారినయ్

మిస్ యూనివర్స్ పోటీకి రూల్స్ మారినయ్

మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనాలంటే చిన్న విషయమేం కాదు. దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలుంటాయి. ముఖ్యంగా పెళ్లి కాని వారై ఉండాలి, గర్భం ధరించిన యువతులు అర్హులు కాదనే కఠిన నిబంధనలున్నాయి. అయితే అలాంటి కొన్ని రూల్స్ ను మినహాయిస్తూ కొత్తగా నిబంధనలను సవరించారు. ఇకపై పెళ్లైన వారు, పిల్లలున్నవారు కూడా ఈ మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. 2023నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. స్త్రీలు తమకు వివాహమైనా, కాకపోయినా సమాజంలో మార్పు తీసుకురాగలరనే నమ్మకంతోనే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక స్త్రీ తన బిడ్డకు ఉజ్వల భవిష్యత్తునివ్వడం కోసం పాటుపడగలిగినపుడు... సమాజం బాగుపడేలా తీర్చిదిద్దలేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ.. పైళ్లయిన వారిని కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. 

తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించేందుకు మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి యువతులు ఈ పోటీల్లో నిలవడం అందరికీ తెలిసిందే. కాగా ఈ అందాల పోటీలో పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు 18 నుంచి 28 ఏళ్ల వయసున్న యువతుల్ని మాత్రమే అనుమతిచ్చేవారు. కానీ తాజా సవరణలతో పెళ్లయింది ఇక ఏం చేయలేమేమో అనుకున్న యువతులకు మంచి ఛాన్స్ వచ్చినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.