రికార్డులనుంచి మిస్సైన ఎయిర్ ఇండియా విమానం..13ఏళ్ల తర్వాత రన్ వేపై ప్రత్యక్షం

రికార్డులనుంచి మిస్సైన ఎయిర్ ఇండియా విమానం..13ఏళ్ల తర్వాత రన్ వేపై ప్రత్యక్షం

రికార్డుల నుంచి మిస్సైన ఎయిర్ ఇండియా విమానం..13 ఏళ్ల తర్వాత దొరికింది..43ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాన్ని కోల్ కతా విమానాశ్రయం రన్ వే హాంగర్ లో గుర్తించారు. పాత విమానాల తొలగింపులో భాగంగా ఈ విమానం బయటపడింది.. అంతేకాదు రెండు కారణాల చేత వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. 

ఎప్పటిలాగే కోల్ కతా ఎయిర్ పోర్టు నుంచి పాత విమానాల తొలగించే పనిలో ఉండగా..13ఏళ్ల క్రితం మిస్సైన ఎయిర్ ఇండియా బోయింగ్ 737-200 విమానం బయటపడింది. ఈ విమానానికి 43ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విమానం కోల్ కతా రన్ వే హ్యాంగర్ లో కనిపించింది. 2012 నుంచి ఇది విమానాశ్రయం ఓ మూలన పడి ఉన్న ఈ విమానాన్ని గుర్తించిన ఎయిర్ పోర్టు అథారిటీ ట్రాక్టర్ ట్రైలర్ లో బెంగళూరు తరలిచింది.. దీంతో ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే సాధారణంగా పనిచేయని విమానాలను ఇంజన్లను తీసేసి అమ్ముతారు. ఈ విమానాన్ని మాత్రం ఇంజనీర్ల శిక్షణకోసం ఇంజిన్ తో సహా అమ్మేశారు. 

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తమ కంపెనీ విమానాల లిస్టులో ఈ బోయింగ్ విమానం ఉన్నట్లు ఎయిర్ ఇండియా సీఈవో కే తెలియదట.. ప్రైవేటీకరణ సమయంలో ఈ విమానాన్ని లిస్టవుట్ చేయడమే మర్చిపోయారట.  మూడేళ్ల క్రితం ఎయిర్‌లైన్ ప్రైవేటీకరణ ప్రక్రియ సమయంలో ఈ విమానం కంపెనీ రికార్డుల నుంచి మిస్సయిందని ఎయిర్ ఇండియా సీఈవో కాంప్ బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో చెప్పడం అందరికీ ఆశ్యర్యం అనిపించింది.  

VT-EHH గా రిజిస్టర్ అయిన ఈ బోయింగ్ విమానం మొదటి సారి 1982లో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో చేరింది.  తర్వాత 1998లో అలయన్స్ ఎయిర్ లీజుకు తీసుకుంది. ఆ తర్వాత 2007లో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో తిరిగి కార్గో విమానంగా చేరి సేవలందించింది. అదే ఏడాది ఇం డియన్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ ఇండియాతో విలీనం తర్వాత ఈ విమానం ఎయిర్ ఇండియాకు బదిలీ అయ్యింది. కొంతకాలం ఇండియా పోస్ట్ ద్వారా ఈ విమానం సేలవందించింది. చివరికి 2012లో ఈ విమానానికి రిటైర్ మెంట్ ప్రకటించారు. అప్పటినుంచి ఎయిర్ ఫీల్డ్ లో మర్చిపోయారు. 

ఇప్పటివరకు 14 విమానాలకు రిటైర్డ్ మెంట్ ఇచ్చారు. వీటిలో ఈ బోయింగ్ విమానం ఒక్కటే రిటైర్డ్ మెంట్ తర్వాత కూడా ప్రత్యేకంగా నిలిచింది.. మిగతా విమానాలను ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేసి రెస్టారెంట్లుగా వినియోగిస్తున్నాయి. డగ్లస్ డిసి 3 డకోటా విమానం కూడి రిటైర్డ్ మెంట్ తర్వాత ప్రత్యేకతను చాటుకుంది . దీనిని ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ 1947 లో డచ్ దళాల నుంచి ఇండోనేషియా నేతలను రక్షించేందుకు మిషన్ లో భాగంగా వినియోగించారు. 

ఆతర్వాత భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ప్రదర్శనకు పెట్టారు. అయితే ఇంకా ఎయిర్ ఇండియాకు చెందిన మరో రెండు పనిచేయని ATR విమానాలు కోల్ కతా విమానాశ్రయంలో ఇంకా ఉన్నాయి.