ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?

ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?
దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా వ్యాపార వేత్త అలీబాబా గ్రూప్ ల వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించాడు. అయితే ప్రత్యక్షంగా కాకుండా ఆయన ఓ వీడియో కాన్ఫెన్స్ లో కనిపించాడు. బుధవారం 100 మంది గ్రామీణ టీచర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కనిపించినట్లు  ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ చీఫ్ రిపోర్టర్ కింగ్ కింగ్ చెన్ తన ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. జాక్ మా  కనిపించాడని..కరోనా అంతమైన తర్వాత మళ్లీ కలుద్దామని  వీడియో కాన్ఫరెన్స్ లో జాక్ మా టీచర్లకు చెప్పినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జెజియాంగ్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ టియాన్ము న్యూస్ మొదటగా నివేదించిందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ వీడియో కాన్ఫరెన్స్  ఎంత వరకు నిజమనేది తెలియదు కానీ..ఆ దేశ మీడియాలో జాక్ మా కనిపించాడని వార్తలు వస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో వివాదం తలెత్తినప్పటి నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్ మా బయటకు రావడం లేదని సమాచారం. నవంబర్‌‌లో తాను నిర్వహిస్తున్న టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్‌’ ఫైనల్ ఎపిసోడ్‌‌కు జడ్జిగా వ్యవహరిస్తున్న జాక్ మా రావాల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమానికి ఆయన హాజరవ్వలేదు. అంతేగాక, ఆ షో వెబ్‌సైట్ నుంచి ఆయన ఫొటోలను తొలగించారని ప్రముఖ యూకే పత్రిక టెలిగ్రాఫ్ వెల్లడించింది. చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వారిలో జాక్​ మా కూడా ఒకరిగా ఉన్నారు. జిన్‌‌పింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలను గతేడాది అక్టోబర్​లో షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా తీవ్రంగా విమర్శించారు. అలీబాబా గ్రూప్స్​పై విచారణ చేస్తున్న సందర్భంగా జాక్ మా చైనాలోనే ఉండాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశించినట్టు సమాచారం. అలాగే క్రిస్మస్​ సందర్భంగా యాంట్ గ్రూప్​నకు చెందిన అన్ని కార్యాకలాపాలను నిలిపివేయాలని బీజింగ్ ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. చైనాలో అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్న జాక్ మా అంతర్జాతీయంగా చేసిన సేవా కార్యక్రమాల వల్ల చైనాకు ప్రపంచవ్యాప్తంగా కాస్త మంచిపేరును తీసుకొచ్చింది. Ma, who used to be an English teacher and founder of #Alibaba, also gives wishes to village teachers via a video on Wednesday, saying usually the activity is held in Sanya in southern Hainan but this year, due to #Covid19 it has to be done via video conference. pic.twitter.com/yfi7oPB5Sb — Qingqing_Chen (@qingqingparis) January 20, 2021