కూతకు దిగితే కప్ కన్ఫామ్   

కూతకు దిగితే కప్ కన్ఫామ్   

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికితీసి పదును పెడితే మెరికల్లా తయారవుతారు. చదువును మద్యలో వదిలేసిన యువతకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తూ శిక్షణ నందిస్తోంది నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ సంస్థ. యువత భవిష్యత్తు పక్కదారి పట్టకుండా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చేలా తీర్చిదిద్దుతోంది. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల్లో శిక్షణ ఇస్తూ జాతీయస్థాయిలో సత్తా చాటేలా తీర్చిదిద్దుతున్నారు సీఐ ఏడుకొండలు.

 

నాగర్ కర్నూల్ జిల్లాలోని మిషన్ కబడ్డీ అనే సంస్థ ఏర్పాటు చేసి.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పోటీ పరీక్షలకు శిక్షణనిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు. డ్రాపవుట్లుగా ఉన్న యువకులను చేరదీసారు. వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. కోచ్ ల సాయంతో శిక్షణ ఇస్తున్నారు. 2021 డిసెంబర్ లో మిషన్ కబడ్డీని ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు 10 టోర్నమెంట్లలో విజేతలయ్యారు. ఈ మిషన్ కింద 2 రాష్ట్రాల్లో 5 టీంలు కబడ్డీ ఆడుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఈ యువకులు సత్తా చాటుతున్నారు.

పోటీ ఎక్కడైనా సరే మిషన్ కబడ్డీ టీం రంగంలోకి దిగితే విజయం వరించాల్సిందే. క్రికెట్ లో నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో యూత్ కి శిక్షణ ఇప్పిస్తుంది ది మిషన్. యువకులకు కావలసిన సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తోంది.చదువుకు దూరమై విమర్శల పడ్డ వీరు ఇపుడు క్రీడల్లో రాణిస్తుంటే అవే నోళ్లే వీరిని మెచ్చుకుంటున్నాయి.


 
ప్రతి మనిషిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందనే అంశాన్ని వెలికితీసింది మిషన్ కబడ్డీ. యూత్ కి ఇష్టమైన పనిలో నిమగ్నం చేయాలని,తద్వారా సమాజానికి ఉపయోగపడేలా కబడ్డీ శిక్షణ ప్రారంభించింది.విద్యార్థులు మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం అవసరమైన డైట్ ను మిషన్ ద్వారా అందిస్తున్నారు. కబడ్డీ కోర్టు,ఫుడ్,ఫిట్ నెస్ ఎక్విప్ మెంట్ సౌకర్యాలతో క్యాంప్ ఏర్పాటు చేసారు. 

వివిధ కారణాలవల్ల చదువును వదిలేసిన..స్పోర్ట్స్ రంగంలో రాణిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు విధ్యార్ధులు.

మరిన్ని వార్తల కోసం

 

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్