రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్

 రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్
  • రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్ 
  • అన్ని రకాల ఫార్మాట్లకి  నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన 
  • మీ అభిమానం, ప్రేమకి ధన్యవాదాలు  
  •  సెంకడ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాని ఎమోషనల్ ట్వీట్ 

 

ఇండియన్ మహిళల కిక్రెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్ని రకాల ఫార్మాట్లకి రిటైర్మెంట్‌ ప్రకటించింది. "  ఇన్నాళ్లా మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు.! మీ ఆశీర్వాదం, మద్దతుతో  నా సెంకడ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాను" అని మిథాలీ ఎమోషనల్ ట్వీట్ చేసింది. 39 ఏళ్ల మిథాలీ..  జూన్ 1999లో తన తొలి మ్యాచ్ ఆడింది. వన్డేలలో 7,805 పరుగులు చేసిన అమె.. 89 టీ20 మ్యాచ్ లలో 2,364 పరుగులు చేసింది..  ఇక12 టెస్టుల్లో 699 పరుగులు చేసింది.  మిథాలీ రాజ్‌ కెప్టెన్సీలో 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.  వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ట్రోఫీలో మొదటి మూడు సీజన్లలో వెలాసిటీ టీమ్‌కి  కెప్టెన్‌గా వ్యవహరించింది మిథాలీ రాజ్.  అయితే ఈ సీజన్‌లో ఆమె పాల్గొనకపోవడంతో మిథాలీ రిటైర్మెంట్‌పై గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి.   ఈ క్రమంలో వాటిని నిజం చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా మిథాలీ  ప్రకటించింది. వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని,  వుమెన్స్ ఐపీఎల్ ఆడాలని కలలు కన్న మిథాలీ .. ఆ రెండు కోరికలు తీరకుండానే  రిటైర్మెంట్ ప్రకటించింది. 

 

మరిన్ని వార్తలు