
మియాపూర్ బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. నడిగడ్డ తండాలో 12 ఏళ్ల బాలిక వసంత మిస్సింగ్ అయిన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గత శుక్రవారం అంటే జూన్ 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బానోతు వసంత తిరిగి రాలేదు. పాప మృతి వెనుక కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 20 రోజుల క్రితం కూలి పనులు చేసుకునేందుకు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు నరేష్,శారద దంపతులు. నరేష్ దంపతుల స్వస్థలం మహబూబబాద్ జిల్లా మర్రి పేడ మండలం లక్ష్మ తండా. మియాపూర్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. పాప మృతితో కన్నీటి పర్యంతం అవుతున్నారు వసంత తల్లిదండ్రులు.