
దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం రికార్డు సృష్టించింది. మే 20న మిజోరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారు.
2011 జనాభా గణన సమయంలో 91.33 శాతం అక్షరాస్యతతో మిజోరం 3వ స్థానంలో ఉన్నది. దీనిని ప్రస్తుతం బ్రేక్ చేసింది. ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత రేటు 98.2 శాతంగా ఉన్నట్లు సీఎం లాల్ దుహోమా ప్రకటించారు. దీనిని మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ఏ రాష్ట్రమైనా 95 శాతం బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు.