గెలిపిస్తే లిక్కర్ బ్యాన్ చేస్తాం : మిజో నేషనల్ ఫ్రంట్

గెలిపిస్తే లిక్కర్ బ్యాన్ చేస్తాం : మిజో నేషనల్ ఫ్రంట్

వచ్చే ఎలక్షన్స్ లో తమను గెలిపిస్తే పూర్తిగా లిక్కర్ ను బ్యాన్ చేస్తామని తెలిపారు మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్). తమను గెలిపిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో మిజోరంలో ఆ పార్టీయే విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ నిర్ణయం అమలుకు నడుం బిగించింది. మిజోరం సంపూర్ణ మద్యనిషేధం బిల్లుకు శనివారం సీఎం జోరంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా రూపొందించడమే తరువాయి. మద్యనిషేధం వల్ల దొంగరవాణా, మాఫియా సమస్య వంటివి తలెత్తుతాయి. కల్తీమద్యం తాగి చనిపోయేవారి సంఖ్యా పెరుగుతుంది. తాగుడు మాన్పించే బదులు మద్యం అందుబాటులోకి రాకుండా చూడాలనే ప్రయత్నాలు బెడిసికొడతాయని చరిత్ర రుజువు చేసింది.