మంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్రు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మంత్రికి తప్పుడు  సమాచారం ఇస్తున్రు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్ భూ వివాదం కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులు, పోలీసు ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ చూపడంపై పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీఎం హోం ట్రస్ట్ పూర్తిగా అనాథ విద్యార్థులకు  సంబంధించినదని, దాని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. ఈ భూముల్లో ఏం చేయాలన్నా ట్రస్ట్ ఛైర్మన్, కమిటీని సంప్రదించాలని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు వీఎం హోం విద్యార్థులపై చెయ్యి చేసుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. వేలాది మంది పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వస్తే తమ విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని అంటున్నారు. ప్రాక్టీస్ కు ప్రత్యామ్నాయ స్థలాలు చూసుకోవాలని సూచించారు. 

మంత్రికి తప్పుడు  సమాచారం ఇస్తున్నారు: ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి

ఇదిలా ఉంటే వీఎం ఘటనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. నిరుపయోగంగా ఉన్న వీఎం హోం స్థలాన్ని చదును చేసి..  కేవలం 45 రోజులు పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ ను కోరారు. ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వీఎం హోం భూముల్లో జేసీబీలతో వర్క్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ లక్ష్మీ పార్వతి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.  పూర్వ విద్యార్థులతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.