డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మోసం : విప్ ఆది శ్రీనివాస్

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మోసం : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. తిప్పాపూర్ మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను, ఇందిరమ్మ ఇండ్లను, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుస్తోందన్నారు. 

ఎన్నో ఏండ్లుగా రాజన్న భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న తిప్పాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణం సాకారమవుతోందన్నారు. 2015లో తిప్పాపూర్ మూడో బ్రిడ్జికి శంకుస్థాపన చేసి అలాగే వదిలేశారన్నారు. 

టెంపుల్ సిటీగా వేములవాడను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట లీడర్లు చంద్రగిరి శ్రీనివాస్, పుల్కం రాజు, చంద్రశేఖర్​, నాగభూషణం, శ్రీనివాస్, అహ్మద్​ పాష పాల్గొన్నారు.