
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు రైతులందరికీ సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ధరూర్ మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద పూజలు చేసి పంట కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంటల సాగుకు సకాలంలో నీళ్లివ్వాలనే ఉద్దేశంతో ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని తెలిపారు.
రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హనుమంతు, భాస్కర్, రామన్ గౌడ్, గడ్డం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.