కాంగ్రెస్ హయాంలోనే విలీన గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కాంగ్రెస్ హయాంలోనే విలీన గ్రామాల అభివృద్ధి :  ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్​ రూరల్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిజామాబాద్​ నగర శివారులోని విలీన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ముబారక్​నగర్, గూపన్​పల్లి గ్రామాల్లో రూ.2 కోట్లతో చేపట్టిన పలు అబివృద్ది పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్​ శివారులో ఉన్న 8 గ్రామాలు కార్పొరేషన్​లో విలీనం కాగా, గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందలేదన్నారు.

నగరంలో కలిసినప్పటికీ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గూపన్​పల్లి, ముబారక్​నగర్​ గ్రామాల్లో రూ.6 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టానని తెలిపారు. త్వరలో జరగే మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించి, విలీన గ్రామాలను మరింత డెవలప్​ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, హన్మాండ్లు, సంజీవ్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.