దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు : దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ గా ఉందని, వారి సం క్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు ప టేల్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్​పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనాతో కలిసి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం పోలీస్ స్టేషన్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుంటారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలను తెచ్చిందన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రతి పౌరుడు నమ్మకంతో మెలగాలని సూచించారు. 

ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఏ ఆపదొచ్చినా నిర్భయంగా స్థానిక పోలీసులను ఆశ్రయించాలన్నారు. అమరులైన పోలీసుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఏ ఎంసీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యం, రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ సత్యం, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.