రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది

V6 Velugu Posted on Jan 31, 2021

రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేవుని పేరుతో అకౌంటబులిటి లేకుండా వసూళ్లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

‘బీజేపీ వాళ్లే కాదు.. మేము కూడా హిందువులమే. తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. 29 రాష్ట్రాల్లో 29 వేల కోట్లు వసూల్ చేసి ఏం చేస్తారు? వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించారు కదా.. అలాగే రాముడి గుడి నిర్మించలేరా? రామ మందిరం నిర్మాణనికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్లు కేటాయించలేదా? కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణనికి డబ్బులు వసూలు చేయవలసిన అవసరం లేదు. రాముడు అందరివాడు. హిందువైన ప్రతి ఒక్కరూ రామున్ని పూజిస్తారు. రామ మందిర నిర్మాణం కోసం దొంగ బుక్కులు తయారు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి ఆలయం కింద ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం కోసం కృషి చేస్తోంది. రాష్ట్రంలో దూప దీప నైవేద్యాల కోసం కూడా నిధులు ఇస్తున్నాం’ అని ఆయన అన్నారు.

For More News..

అన్నం ఆలస్యంగా పెట్టిందని తల్లిని చంపిన కొడుకు

లోయలో పడ్డ టీచర్ల బస్సు.. 10 మంది మృతి

సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

Tagged Bjp, TRS, Telangana, Ayodhya Ram Mandir, MLA Challa Dharma Reddy, POLITICS, Ramudu, TEMPLES

Latest Videos

Subscribe Now

More News